‘పుష్ప-2’ తొక్కిసలాట.. శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థిక సాయం

'పుష్ప-2' తొక్కిసలాట.. శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థిక సాయం

హైదరాబాద్‌ (Hyderabad)లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద ‘పుష్ప-2’ (‘Pushpa-2’) విడుదల సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన శ్రీ‌తేజ్ (Sritej) కుటుంబాన్ని తీవ్ర‌ విషాదంలో ముంచేసింది. ఈ దుర్ఘటనలో చిన్నారి శ్రీతేజ్ తీవ్రంగా గాయపడగా, అతని తల్లి రేవతి (Revathi) ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత కుటుంబం ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ప్రభుత్వ సాయం
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మానవతా దృష్టితో ముందుకొచ్చింది. ‘మిషన్ వాత్సల్య పథకం’ (‘Mission Vatsalya scheme) కింద చిన్నారి శ్రీతేజ్‌కు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా రూ.4,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే గత మూడు నెలలకుగాను రూ.12 వేలు వారి ఖాతాలో జమయ్యాయి.

ప్రస్తుతం శ్రీతేజ్ గాయాల నుండి కోలుకుంటూ ఉన్నాడు. చిన్నారికి త్వరగా సంపూర్ణ ఆరోగ్యం కలగాలని, భవిష్యత్తు బాగుండాలని అందరూ కోరుకుంటున్నారు. కాగా, శ్రీ‌తేజ్ కుటుంబానికి అల్లు అర్జున్, పుష్ప సినిమా నిర్మాణ సంస్థ భారీగా ఆర్థిక‌సాయం అందించాయి. ప్ర‌భుత్వం కూడా శ్రీ‌తేజ్ కుటుంబానికి అండ‌గా నిలుస్తూ ప్ర‌తి నెలా రూ.4 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment