---Advertisement---

శ్రీ‌తేజ్‌ను ప‌రామ‌ర్శించిన సీపీ ఆనంద్‌.. బాలుడి ఆరోగ్యం ఎలా ఉందంటే..

శ్రీ‌తేజ్‌ను ప‌రామ‌ర్శించిన సీపీ ఆనంద్‌.. బాలుడి ఆరోగ్యం ఎలా ఉందంటే..
---Advertisement---

హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప-2’ విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో బాలుడికి ఆక్సిజన్ సరిపోక బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం అతడు కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నాడు.

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. బాలుడి ఆరోగ్య ప‌రిస్థితిని వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి పూర్తిగా మెరుగుపడటానికి మరికొంత సమయం పట్టవచ్చని డాక్టర్లు స్పష్టం చేశారు. వైద్యులు త్వరలో మెడికల్ బులెటిన్ విడుదల చేయనున్నారు.

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో బాలుడి త‌ల్లి రేవతి మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌పై హీరో అల్లు అర్జున్ కూడా విచారం వ్య‌క్తం చేశారు. రేవ‌తి కుటుంబానికి రూ.25 ల‌క్ష‌ల న‌గదు సాయంతో పాటు శ్రీ‌తేజ్ చికిత్స అయ్యే పూర్తి ఖ‌ర్చు భ‌రిస్తాన‌ని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి ఏ విధ‌మైన సాయం కావాల‌న్నా చేయ‌డానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని మ‌రోసారి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment