‘పుష్ప 2′ చిత్రంలోని ‘దమ్ముంటే పట్టుకోరా’ అనే సాంగ్‌ను నిన్న మూవీ టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పాటను యూట్యూబ్ నుంచి తాజాగా తొలగించారు. దీంతో అభిమానుల్లో ఆ పాటను తొలగించడానికి గల కారణం ఏమై ఉంటుందనే చర్చ మొదలైంది.
ఇది అల్లు అర్జున్‌పై కోర్టులో ఉన్న కేసుతో సంబంధం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై చిత్ర బృందం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పాటను మళ్లీ విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి.