“పుష్ప” సినిమాలో హీరో పుష్పరాజ్ తన ఇంటిపేరు కోసం, దాని లేకపోవడం వల్ల ఎదుర్కొన్న అవమానాలపై పోరాడుతాడు. సున్నా నుంచి హీరోగా ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని, చివరికి ఆ ఇంటిపేరు తనను వెతుక్కుంటూ వస్తుంది. ఒకరకంగా జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) పరిస్థితి కూడా పుష్పరాజ్ కథకు దగ్గరగా ఉంటుంది. తారక్ (Tarak)ను అభిమానించే వారికి ఈ విషయం తెలుసు. తాజాగా ఇదే అంశం గురించి ఎంపీ (MP) దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) పలు విషయాలు పంచుకున్నారు.
చిన్నతనంలో దూరం పెట్టింది ఎందుకు?
సీనియర్ ఎన్టీఆర్ కూతురు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తారక్‌ను చిన్నతనంలోనే నందమూరి ఫ్యామిలీ (Nandamuri Family)కి ఎందుకు దూరం పెట్టారో ఇలా వివరించారు: “జూనియర్ ఎన్టీఆర్‌ను చిన్నతనంలోనే దూరం పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. దానిని పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. కారణాలు అయితే ఉన్నాయి. కొంచెం దూరం పెరిగింది. కానీ, ఇప్పుడు అందరం కలిసే ఉంటున్నాం” అని ఆమె అన్నారు.
రాజకీయ ఎంట్రీపై పురందేశ్వరి వ్యాఖ్యలు
ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ (Political Entry) గురించి కూడా పురందేశ్వరి మాట్లాడారు. “రాజకీయాల్లోకి తారక్ రావాలనుకుంటే వస్తారు. అతనిది ఇంకా చిన్న వయసు. అలాంటప్పుడు పాలిటిక్స్‌లోకి తారక్ రావాల్సిన అవసరం ఉందా..? అనేది మనం ప్రశ్నించుకోవాలి. అయితే, రాజకీయాల గురించి తారక్ మనసులో ఏముంది..? అనేది నాకు తెలియదు. ఈ విషయం గురించి ఎప్పుడూ కూడా చర్చించలేదు” అని పురందేశ్వరి (Purandeswari) అన్నారు.
గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆమె మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తారక్ తన పిల్లలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాడని పురందేశ్వరి చెప్పారు. తను నటించిన సినిమా విడుదలైతే తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటానని ఆమె అన్నారు. తనను జూ. ఎన్టీఆర్ ‘అత్తా’ (Aunt) అని పిలుస్తాడని, తనతో ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె పలుమార్లు పంచుకున్నారు.