---Advertisement---

అర్ధ‌రాత్రి కాల్పుల శ‌బ్ధం.. ఆప్ ఎమ్మెల్యే మృతి

అర్ధ‌రాత్రి కాల్పుల శ‌బ్ధం.. ఆప్ ఎమ్మెల్యే మృతి
---Advertisement---

పంజాబ్ రాష్ట్రంలో అర్ధ‌రాత్రి ఘోర ఘటన జ‌రిగింది. గుర్తు తెలియని దుండగుల జ‌రిపిన కాల్పుల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ బస్సి గోగి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. శుక్రవారం రాత్రి లూధియానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గుర్‌ప్రీత్ గోగిపై దుండగులు దాడి చేశారు. కాల్పుల అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు.

దర్యాప్తు ప్రారంభం
ఈ హత్యపై పంజాబ్ ఆప్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను శిక్షించేలా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ దాడి రాష్ట్రంలో భద్రతా పరిస్థితులపై ఆందోళన కలిగిస్తోంది. ప్రతిపక్షాలు ఈ ఘటనను రాష్ట్ర సర్కారుపై విమర్శలకు వేదికగా మార్చాయి. ప్రజల భద్రత కోసం పంజాబ్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని, ఎమ్మెల్యేకే ర‌క్ష‌ణ లేక‌పోతే సామాన్య‌లు ప‌రిస్థితి ఏంటంటూ ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment