బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌పై స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ సీ
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రియాంక చోప్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2006లో వచ్చిన డాన్
సినిమాలో షారుఖ్ ఖాన్‌తో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. డాన్ సినిమా ఫిల్మ్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఎలా ఉండాలో బాగా నేర్పించిందని ఆమె అభిప్రాయపడ్డారు.
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ అంకితభావాన్ని అభినందిస్తూ “అతను ఫైట్ సీక్వెన్స్‌ల కోసం చాలా కష్టపడ్డాడు. యాక్షన్ సన్నివేశాల్లో రక్తం చిందించిన సందర్భాలు ఉన్నాయి” అని ప్రియాంక చెప్పింది. ప్రియాంక వ్యాఖ్యలు బాలీవుడ్‌లో ఐకానిక్‌గా నిలిచిపోయిన డాన్ చిత్రాన్ని తెరకెక్కించడానికి వెనుక ఉన్న కృషి, నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి.