సంగీత్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన ప్రియాంక క‌పుల్స్‌

సంగీత్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన ప్రియాంక క‌పుల్స్‌

రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా తన ఎనర్జీతో అందరినీ అలరించే ప్రియాంకా చోప్రా.. తాజాగా మరోసారి తన డాన్స్‌తో వార్తల్లో నిలిచింది. త‌న సోద‌రుడు సిద్ధార్థ్ చోప్రా- నీలం ఉపాధ్యాయల వివాహ వేడుకలో హిందీ సినీ అభిమానులను కట్టిపడేసే ‘మ‌న్ మేరీ జాన్‌’ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది.

తన భర్త నిక్ జోనస్‌తో కలిసి స్టేజీపై డాన్స్ చేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ అద్భుతమైన డ్యాన్స్‌ను పెళ్లికి హాజరైన అతిథులు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు ప్రియాంకా ఎనర్జీ, గ్రేస్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment