ప్రియదర్శి (Priyadarshi) హీరోగా, నిహారిక (Niharika) హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘మిత్రమండలి’ (Mitramandali). ఈ సినిమా ట్రైలర్ (Trailer) విడుదలైనప్పుడు తమను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ పెట్టారని తెలియడంతో, ఈ విషయంపై హీరో ప్రియదర్శిని అడుగగా, ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
“నిజానికి నాకు ఇంతకుముందు ఇలా ఎప్పుడూ జరగలేదు. అది కూడా ఒకే ఐపీ అడ్రస్ నుంచి 300 ఐడీలతో కామెంట్స్ పెట్టించారని తెలిసి షాక్ అయ్యాను. ఇది ఎవరు చేస్తున్నారు, ఏంటి అనేది నాకు అస్సలు అర్థం కావడం లేదు. దీనికి ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు. అయితే ఒక విషయం మాత్రం చెప్పగలను, ఇప్పటికే దీనిపై సైబర్ క్రైమ్ (Cyber Crime )లో ఫిర్యాదు చేశాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అని ప్రియదర్శి అన్నారు.
ఏదేమైనా, ఇలా టార్గెట్ చేసి నెగిటివ్ కామెంట్స్ (Negative Comments) చేయడం తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. “ఏదైనా నేను తప్పు చేస్తే నన్ను విమర్శించవచ్చు, కానీ ఇలా చేయడం మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. నా సినిమాను ఉద్దేశించి ఇలా చేస్తున్నారా, లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయో నాకు తెలియదు” అని ప్రియదర్శి అన్నారు.







