ఈనెల 8న విశాఖలో మోదీ పర్యటన

ఈనెల 8న విశాఖలో మోదీ పర్యటన

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈనెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతారు. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ప్రధాని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో NTPC నిర్మించనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌కు పీఎం మోదీ శంకుస్థాపన చేస్తారు. జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి అనేక ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఈనెల 4న జరిగే నేవీ డే పరేడ్, 8న జ‌రిగే ప్రధాని సభలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికారులు, కేంద్ర‌మంత్రులు కూడా పాల్గొంటారు.

Join WhatsApp

Join Now

Leave a Comment