---Advertisement---

హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. ప‌లుచోట్ల‌ ట్రాఫిక్ ఆంక్షలు

president-visit-hyderabad-traffic-alert
---Advertisement---

రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము నేడు హైదరాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.  ఐదు రోజుల పాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. డిసెంబర్ 17 నుండి 21 వరకు రాష్ట్రపతి నిలయంలో భారత రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక అలర్ట్ జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.

ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి పంజాగుట్ట వరకు పలు ప్రధాన రహదారులు, జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయ‌ని, వాహ‌న‌దారులు గ‌మ‌నించాల‌ని ట్రాఫిక్ ఉన్న‌తాధికారులు కోరారు.

ట్రాఫిక్స్ ఆంక్ష‌లుండే ప్రాంతాలు
హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, Y జంక్షన్, బొల్లారం చెక్‌పోస్ట్, నేవీహౌస్ జంక్షన్, యాప్రాల్, హెలిప్యాడ్ Yజంక్షన్, బైసన్ క్రాస్ రోడ్డు, అమ్ముగూడ జంక్షన్, లోతుకుంట, లాల్‌బ‌జార్, తిరుమలగిరి క్రాస్ రోడ్డు, బేగంపేట ఫ్లైఓవర్, రసూల్‌పూర, పంజాగుట్ట జంక్షన్, యశోద హాస్పిటల్,  కత్రియా హోటల్, రాజ్ భవన్, మెట్రో రెసిడెన్సీ, వీవీ విగ్రహం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

వాహ‌న‌దారులు రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించేందుకు ప్రయత్నించాల‌ని, అత్యవసరమైన పనులుంటే ముందస్తు ప్ర‌యాణాలు చేప‌ట్టాల‌ని ట్రాఫిక్ విభాగం సూచించింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment