భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని AIIMSలో జరుగనున్న ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు.
డిసెంబర్ 17న గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం 11:20 గంటలకు రాష్ట్రపతి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 12:05 గంటలకు మంగళగిరి AIIMSకి చేరుకుంటారు. 1:15 గంటల వరకు స్నాతకోత్సవంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం MBBS విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేస్తారు.
రాష్ట్రపతితో పాటు హాజరయ్యే వీఐపీలు
ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి ప్రతాపరావు జాదవ్, ఏపీ మంత్రులు సత్య కుమార్, లోకేష్ తదితర ప్రముఖులు గౌరవ అతిథులుగా పాల్గొననున్నారు.