కుంగిపోయిన రాష్ట్ర‌ప‌తి హెలిప్యాడ్‌.. కేరళలో హై అలర్ట్ (Video)

కుంగిపోయిన రాష్ట్ర‌ప‌తి హెలిప్యాడ్‌.. కేరళలో హై అలర్ట్

దేశ ప్ర‌థ‌మ పౌరురాలు, రాష్ట్ర‌ప‌తి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ప‌ర్య‌ట‌న‌లో ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్ర‌ప‌తి ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ (Helicopter) ల్యాండింగ్ (Landing) స‌మ‌యంలో హెలిప్యాడ్ (Helipad) కుంగిపోయింది. ఈ ఘ‌ట‌న కేరళ (Kerala)లోని ప్రమదం స్టేడియం హెలిప్యాడ్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. సదరు ప్రాంతంలో ఉన్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి హెలికాప్టర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. రాష్ట్ర‌ప‌తి ముర్మును సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు.

ప్రెసిడెంట్‌ ద్రౌపది ముర్ము శ‌బరిమల (Sabarimala) ఆలయ దర్శనం కోసం కేరళ పర్యటనకు వెళ్లారు. ఆమె నాలుగు రోజుల అధికారిక పర్యటన అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 24 వరకు కొనసాగుతుంది. మంగళవారం ఆమె తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ అర్లేకర్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ ఆమెకు స్వాగతం పలికారు.

తదుపరి కార్యక్రమాల్లో భాగంగా నేడు శ‌బరిమల ఆలయంలో దర్శనం, ఆర్తి నిర్వహించనున్నారు. అక్టోబర్ 23న తిరువనంతపురంలోని రాజ్ భవన్‌లో మాజీ రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత శ్రీ నారాయణ గురు మహాసమాధి శతాబ్ది వేడుకలను వర్కలలో ప్రారంభించి, పలైలోని సెయింట్ థామస్ కళాశాల ప్లాటినం జూబిలీ సమారోహానికి హాజరవుతారు.

అక్టోబర్ 24న ప్రెసిడెంట్ ద్రౌప‌ది ముర్ము ఎర్నాకులంలోని సెయింట్ థెరిసా కళాశాల శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ఇదిలా ఉండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ నేతృత్వంలోని బృందం రాష్ట్రపతిని కలుసుకుని శ‌బరిమల బంగారం దొంగతనం ఘటనతో పాటు ప్రజా సమస్యలపై వివరాలు అందజేయ‌నుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment