సుప్రసిద్ధ బాలీవుడ్ నటి, కింగ్స్ లెవన్ పంజాబ్ టీమ్ యజమాని ప్రతీ జింటా(Preity Zinta) రాజకీయా(Politics)ల్లోకి వస్తున్నారా..? ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియా(Social Media)లో హల్‌చల్ చేస్తోంది. సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా ఇటీవల ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. కాగా, ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ప్రీతి ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ఓ అభిమాని, “మీకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం ఉందా..?” అని ప్రశ్నించగా ఆమె ఆసక్తికరంగా స్పందించారు.
ప్రీతి జింటా తన రాజకీయ ప్రస్థానంపై స్పష్టత ఇస్తూనే కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గతంలో కొన్ని రాజకీయ పార్టీలు ఆమెకు టికెట్ ఆఫర్ చేశాయని అయినప్పటికీ, వాటిని తాను స్వీకరించకుండా సున్నితంగా తిరస్కరించినట్లుగా ఆమె వివరించారు. సినీ రంగంలోనే తాను సంతోషంగా ఉన్నానని, రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే తనకు లేదని ఆమె చెప్పడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది.