అనంతపురం (Anantapur) జిల్లా కళ్యాణదుర్గం (Kalyandurgam) పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భిణి (Pregnant Woman) శ్రావణి (Shravani) (22) ఉరేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. స్థానిక టీడీపీ కార్యకర్త బోయ శ్రీనివాస్ (Boya Srinivas) భార్య అయిన శ్రావణి (Shravani), భర్త తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులకు (Police) ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తోంది.
శ్రావణి భర్తపై చర్యలు తీసుకోకుండా, టీడీపీ నేతలు అయిన కళ్యాణదుర్గం మునిసిపల్ మాజీ ఛైర్మన్ రమేష్ (Ramesh), మాజీ సర్పంచ్ శర్మాస్ (Sharmas) లు పోలీసులపై ఒత్తిడి తెచ్చారని మృతురాలి కుటుంబం ఆరోపించింది. న్యాయం జరగకపోవడంతో, మానసిక వేదన భరించలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మరణానికి ముందు రికార్డ్ చేసిన ఆడియో కాల్‌లో, “నా చావుకు కారణం టీడీపీ నేతలు, పోలీసు అధికారులు” అని శ్రావణి పేర్కొంది. భర్త శ్రీనివాస్‌తో పాటు, నేతలు రమేష్, శర్మాస్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.