---Advertisement---

గూగుల్ ఇండియా మేనేజర్‌గా ప్రీతి లోబానా.. ఎవ‌రు ఈమె?

గూగుల్ ఇండియా మేనేజర్‌గా ప్రీతి లోబానా
---Advertisement---

టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా కంట్రీ నూతన మేనేజర్, వైస్ ప్రెసిడెంట్‌గా ప్రీతి లోబానాను నియమించింది. గూగుల్ ఆసియా పసిఫిక్ రీజియన్ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ పొందిన సంజయ్ గుప్తా స్థానంలో ఈమె చేరారు. ప్రీతి లాంటి సాంకేతిక నిపుణురాలి నియామకంతో గూగుల్ భారత్‌లో తన ప్రాభవాన్ని మరింత పెంచాలని చూస్తోంది.

ప్రీతి లోబానా గురించి..
ప్రీతి లోబానాకు టెక్నాలజీ, ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్ విభాగంలో సీనియర్ లీడర్షిప్ రోల్స్ 30 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం కలిగి ఉంది. గూగుల్ వైస్ ప్రెసిడెంట్‌గా, గూగుల్ టెక్ – ప్రాసెస్, పార్టనర్, పబ్లిషర్ ఆపరేషన్స్, యాడ్స్ కంటెంట్, క్వాలిటీ ఆపరేషన్స్‌ విభాగాల్లో పనిచేశారు. గూగుల్ కంటే ముందు లోబానా నాట్‌వెస్ట్ గ్రూప్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ మరియు ఏ యన్ జీ గ్రైండ్‌లేస్ వంటి దిగ్గజ సంస్థల్లో బ్యాంక్‌లలో నాయకత్వ స్థానాల్లో పనిచేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్‌ పూర్వ విద్యార్థి అయిన లోబానా.. లార్జ్ అండ్ కాంప్లెక్స్ ఆర్గనైజషన్స్ లో బలమైన టీమ్స్ ని బిల్డ్ చేయటం వంటి ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నట్లు తెలిపింది గూగుల్.

ప్రీతి ముందున్న బాధ్యతలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిజ్ఞానాన్ని భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం. దేశంలోని డిజిటల్ ఇన్నోవేషన్స్‌ను ప్రోత్సహించేందుకు కొత్త వ్యూహాలను అమలు చేయడం. భారత మార్కెట్‌కు ప్రత్యేకమైన టెక్నాలజీ పరిష్కారాలను అభివృద్ధి చేయడం.

గూగుల్ ప్రకటన
గూగుల్ ప్ర‌క‌ట‌న‌ ప్రకారం, ప్రీతి ఇన్నోవేషన్ పెంపొందించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. AI, మిషన్ లెర్నింగ్ లాంటి సాంకేతికతలను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment