సొంత రాష్ట్రంలో చతికిలపడ్డ ప్రశాంత్ కిషోర్

సొంత రాష్ట్రంలో చతికిలపడ్డ ప్రశాంత్ కిషోర్

ప్రముఖ రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) (పీకే) సొంత రాష్ట్రమైన బీహార్‌ (Bihar)లో ఘోరంగా చతికిలపడ్డారు. ఈసారి నితీష్ కుమార్ నేతృత్వంలోని కూటమి ఓడిపోతుందని, రాష్ట్రంలో మార్పు ఖాయమని, తమ ‘జన్ సురాజ్ పార్టీ’ (Jan Suraaj Party) వైపు బీహారీయులు మొగ్గు చూపుతున్నారని ఎన్నికల ముందు నుంచి పీకే చేసిన ప్రచారం పూర్తిగా అట్టర్ ప్లాప్ అయింది.

శుక్రవారం ఉదయం బీహార్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో జన్ సురాజ్ పార్టీ మొదట రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు కనిపించినా, ఆ తర్వాత పూర్తిగా ప్రభావం కోల్పోయింది. ప్రస్తుతం జన్ సురాజ్ పార్టీ ‘జీరో’ స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ పార్టీ చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపలేకపోయింది.

సర్వేలు చెప్పినట్లుగానే, బీహార్ ప్రజలు అధికార ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపారు. తాజా ఫలితాల ప్రకారం, ఎన్డీఏ కూటమి ఏకంగా 180 పైగా స్థానాల్లో ముందంజలో ఉండి భారీ విక్టరీ దిశగా దూసుకుపోతోంది. మరోవైపు, మహాఘట్‌బంధన్ కూటమి కేవలం 50 కంటే తక్కువ స్థానాలు దగ్గర కొనసాగుతుంది. దీంతో ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహం సొంత గడ్డపై పూర్తిగా విఫలమైందనే చెప్పాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment