డైరెక్ట‌ర్‌ వర్సెస్ డీవీవీ.. వివాదం ఏంటంటే..

డైరెక్ట‌ర్‌ వర్సెస్ డీవీవీ.. వివాదం ఏంటంటే..

హానుమాన్ సినిమాతో దేశవ్యాప్త మంచి పేరు తెచ్చుకున్న టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ఇటీవల మరోసారి వివాదాలు ముంచుకొచ్చాయి. అతను అనేకమంది ప్రొడ్యూసర్ల నుంచి అడ్వాన్స్‌లు తీసుకుని, ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని పరిశ్రమలో ఓ వార్త షికార్ చేస్తోంది. ఇందులో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కూడా భాగస్వామి అని ప్రచారం. అయితే, ఈ ఊహాగానాలను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా తిరస్కరించింది. ఇది ప్రశాంత్ వర్మ భవిష్యత్ ప్రాజెక్టులపై ప్రభావం చూపుతున్న అంశం అని కొట్టిపారేసింది.

వివాదం ఏమిటి?
ప్రశాంత్ వర్మ దాదాపు 10 మంది ప్రముఖ ప్రొడ్యూసర్ల నుంచి (డీవీవీ దానయ్యతో పాటు మరికొందరు) అడ్వాన్స్ మొత్తాలు తీసుకున్నాడని ఇండస్ట్రీ బజ్. ప్రతి ఒక్కరూ తన సినిమాకు అతని ‘నెక్స్ట్ ఫిల్మ్’ అవుతుందని భావించారు. కానీ, ప్రాజెక్టులు సాగకపోవడంతో ప్రొడ్యూసర్లు డబ్బు తిరిగి చెల్లించమని ఒత్తిడి తెచ్చారు. దీనిపై ఫిల్మ్ ఛాంబర్‌లో కేసు వేయాలని కొందరు భావిస్తున్నారు.

హానుమాన్ తర్వాత అతని ప్లాన్ ఏంటంటే బాల‌కృష్ణ కుమారుడు మోక్ష‌ మోక్షజ్ఞతో ఒక సినిమా, జై హానుమాన్ సీక్వెల్.. అంతా స్టాల్ అయ్యాయి. ఆర్థిక ఒత్తిడితో అతను తన పెట్టుబడులను లిక్విడేట్ చేసి డబ్బు చెల్లించాల్సి వస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన ప్రొడ్యూసర్ డీవీవీ దనయ్యతో ప్రశాంత్ వర్మ మధ్య ఏ ఆర్థిక లావాదేవీలు లేవని, ఎటువంటి ప్రాజెక్ట్ లేదని అధికారిక ప్రకటనలో చెప్పారు. ఈ ప్ర‌క‌ట‌న ఇవాళే విడుద‌ల కావ‌డం గ‌మ‌నార్హం.

డీవీవీ దానయ్య ఇటీవ‌ల OG సినిమాలో సుజిత్‌తో వివాదాలు ఎదుర్కొన్నాడని ఒక పుకారు ఉంది. ఇప్పుడు ప్రశాంత్ వర్మపై జ‌రుగుతున్న‌ ఊహాగానాల్లోనూ డీవీవీ పేరును మళ్లీ లాగుతున్నారు. ఈ వివాదంపై ఫ్యాన్స్ మధ్య డిబేట్ జ‌రుగుతోంది. కొందరు ప్రశాంత్ వర్మను సపోర్ట్ చేస్తూ “ఇది కుట్ర” అంటున్నారు, మరికొందరు ప్రొడ్యూసర్ల పక్షాన నిలబడి “అడ్వాన్స్‌లు తిరిగి చెల్లించాలి” అని త‌మ వాద‌న‌ను వినిపిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment