‘ప్ర‌కాశం’లో దారుణం.. భార్యను క‌ట్టేసి చిత్రహింసలు పెట్టిన భర్త అరెస్ట్

'ప్ర‌కాశం'లో దారుణం.. భార్యను క‌ట్టేసి చిత్రహింసలు పెట్టిన భర్త అరెస్ట్

క‌ట్టుకున్న భార్య‌ (Wife)ను తాళ్ల‌తో క‌ట్టేసి బెల్ట్‌ (Belt)తో అత్యంత దారుణంగా కొడుతూ, వెన్ను విరిచి కాళ్ల‌తో త‌న్నుతూ చిత్ర‌హింస‌ల‌కు గురిచేసిన ఘ‌ట‌న యావ‌త్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. బెల్ట్ దెబ్బ‌ల ధాటికి భార్య గ‌గ్గోలు పెడుతున్నా.. క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తించిన వీడియోలు నెట్టింట వైర‌ల్ కావ‌డంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి ఎట్ట‌కేల‌కు ఆ కీచ‌క భ‌ర్తను అరెస్ట్ చేశారు.

వివ‌రాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా (Prakasam District) తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామానికి చెందిన బాలాజీ (Balaji)కి స‌మీప బంధువుల అమ్మాయి భాగ్య‌ల‌క్ష్మి (Bhagyalakshmi)తో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జ‌రిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కానీ, కొంతకాలంగా భార్య పిల్లలను వదిలేసి మరో మహిళతో హైదరాబాద్‌ (Hyderabad)లో ఉంటున్నాడు. భార్య భాగ్యలక్ష్మి స్థానికంగా ఉన్న ఓ బేకరీలో పనిచేసి పిల్లలను పోషిస్తూ, వారిని చదివిస్తోంది.

కాగా, శనివారం గ్రామానికి వచ్చిన బాలాజీ, డబ్బుల కోసం భార్యను వేధించి, రెండు చేతులను గుడిసె పోల్స్‌కు తాళ్లతో కట్టి రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు బెల్టుతో కొడుతూ, జుట్టు పట్టుకొని వెనక్కి విరిచి, కాళ్లతో తన్నుతూ చిత్రహింసలు పెట్టాడు. ఈ దారుణాన్ని బాలాజీ ప్రియురాలు వీడియో తీసింది. సోమవారం రాత్రి మరలా దాడి చేయబోయే సమయంలో భాగ్యలక్ష్మి తప్పించుకుని సమీప చర్చికి చేరింది. స్థానికులు ఆమెను రక్షించారు. మొదట పోలీసులు పట్టించుకోకపోయినా, వీడియో దేశ వ్యాప్తంగా వైర‌ల్ కావ‌డంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి బాలాజీతో ఈ దారుణానికి స‌హ‌క‌రించిన అక్క, మేనల్లుడు, దారుణాన్ని వీడియో తీసిన అతని ప్రియురాలిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment