‘కన్నప్ప’ నుండి ప్రభాస్ లుక్ విడుదల

'కన్నప్ప' నుండి ప్రభాస్ లుక్ విడుదల

మంచు విష్ణు డ్రీమ్డ్ ప్రాజెక్టు క‌న్న‌ప్ప‌. ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాలో విష్ణు క‌న్న‌ప్ప పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, ఈ ప్రాజెక్టులో భారీ తారాగ‌ణం భాగ‌స్వామ్య‌మైంది. ఈ ప్రతిష్టాత్మక ‘కన్నప్ప’ చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసింది.

ప్రభాస్ లుక్ ఎలా ఉందంటే?
ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. విడుదలైన ఈ గ్లింప్స్ లో ప్రభాస్ ధృఢమైన లుక్‌తో కనిపించి అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ రుద్ర క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లు సమాచారం. ఫ‌స్ట్ గ్లింప్స్‌లో కాషాయ వస్త్రాలు ధరించి, చేతిలో కర్రతో నుదుట విభూది ధరించి, మెడలో రుద్రాక్షలతో ఆకట్టుకున్నారు. ”ప్రళయ కాల రుద్రుడు.. త్రికాల మార్గదర్శకుడు.. శివాజ్ఞ పరిపాలకుడు.. రుద్ర” అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించారు మేకర్స్. సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్ ట్రెండ్ అవుతోంది. సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment