పాన్ ఇండియా సూపర్ స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ గురించి మరో ఆసక్తికర సమాచారం బయటపడింది. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, మెగా హీరో వరుణ్ తేజ్ ఈ కథలో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.
వరుణ్ తేజ్ ఈ చిత్రంలో ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. మెగా హీరో మరియు రెబల్ స్టార్ మధ్య ఈ సినిమాలో ఢీ అంటే ఢీ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఈ విషయం ప్రభాస్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. మెగా వర్సెస్ రెబల్ స్టార్ కలయికపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి వీరిద్దరి కాంబోపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.