రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ (Prabhas) హీరోగా, మారుతి (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ది రాజాసాబ్’ (The Raja Saab). హారర్, కామెడీ, రొమాన్స్ అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి దోగ్రా లాంటి హీరోయిన్లు నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా కనిపించబోతున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwaprasad) నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు అందరి దృష్టి సినిమా విడుదల తేదీపై ఆసక్తి నెలకొంది. కాగా, గత కొన్ని రోజులుగా ‘రాజాసాబ్’ సంక్రాంతికి విడుదల అవుతుందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా నిర్మాత విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు.
“రాజాసాబ్ అక్టోబర్ నాటికి రెడీ అవుతుంది. తెలుగు బయ్యర్లు జనవరి 9న రిలీజ్ చేయమంటున్నారు. హిందీ బయ్యర్లు డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం సినిమాను సంక్రాంతికి చూడాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం మేమూ డిసెంబర్ 5 లేదా 6న రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం” అని వెల్లడించారు.
“టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసేశాం. కొన్ని పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. VFX పనుల్లో కూడా ఎక్కడా రాజీ పడకుండా, హై క్వాలిటీ టెక్నికల్ వర్క్ చేస్తున్నాం” అని చెప్పారు.