‘ది రాజా సాబ్’ రిలీజ్ డేట్‌ను ప్రకటించిన నిర్మాత విశ్వప్రసాద్

'ది రాజా సాబ్' రిలీజ్ డేట్‌ను ప్రకటించిన నిర్మాత విశ్వప్రసాద్

ప్రభాస్ (Prabhas), మారుతి (Maruthi) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ది రాజా సాబ్’ (The Raja Saab). హారర్, కామెడీ, రొమాంటిక్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి హీరోయిన్‌లుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (Peoples Media Factory) బ్యానర్‌ (Banner)పై విశ్వప్రసాద్ (Vishwaprasad) నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది.

కొంతకాలంగా ఈ సినిమా విడుదల తేదీపై పలు ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా సంక్రాంతికి వస్తుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ఊహాగానాలకు నిర్మాత విశ్వప్రసాద్ స్వయంగా ముగింపు పలికారు. ఇటీవల జరిగిన ‘మిరాయ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌లో ఆయన మాట్లాడుతూ, జనవరి 9న సంక్రాంతి కానుకగా ‘రాజా సాబ్’ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్స్ బంద్, ఇతర కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ మరియు VFX పనులు మిగిలి ఉన్నాయి. సంక్రాంతికి ఇప్పటికే పలు సినిమాలు రేసులో ఉన్న నేపథ్యంలో, ‘రాజా సాబ్’ రాకతో ఈసారి పండగ పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment