పాన్-ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్(Prabhas) మరియు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో తెరకెక్కనున్నహై ఆక్టేన్ యాక్షన్ మూవీ ‘స్పిరిట్’ (Spirit Movie) గురించి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, దర్శకుడు యూఎస్ (US) లో జరిగిన ఓ ఈవెంట్ లో కీలక సమాచారం వెల్లడించారు.
ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్ కోసం మెక్సికోలో కొన్ని కీలక లొకేషన్లు పరిశీలించాం మరియు అక్కడే షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వివరించారు. ఈ అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.