ప్ర‌భాస్ స్పిరిట్ సినిమాపై క్రేజీ అప్డేట్

ప్ర‌భాస్ స్పిరిట్ సినిమాపై క్రేజీ అప్డేట్

పాన్ ఇండియా సూప‌ర్ స్టార్ ప్రభాస్ (Prabhas) మ‌రో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, తాజాగా కల్కి 2898 ఏ.డి లాంటి విజువల్ గ్రాండియర్ సినిమాలు ప్రభాస్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచాయి. ఇకపోతే, ఈ హై బడ్జెట్ చిత్రాల మధ్య మరో ఆసక్తికర ప్రాజెక్ట్ “స్పిరిట్ (Spirit)”పై భారీ హైప్ నెలకొంది. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. ఇదే ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తొలి సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ (Police Officer) పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటివరకు మాస్ హీరో, లవర్ బాయ్ పాత్రలతో అలరించిన ఆయన, ఈ సారి హై ఇంటెన్సిటీ పోలీస్ డ్రామాతో రానున్నాడు. గతంలో మెక్సికోలో ప్రీ-ప్రొడక్షన్ (Pre-Production) పనులు పూర్తి చేసిన ఈ మూవీ, జూన్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్‌లోకి వెళ్లనున్నట్లు టాక్. ఫ్యాన్స్ (Fans) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ అప్డేట్ (Update) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటికీ ప్రభాస్ పాత్రపై పూర్తి వివరాలు బయటకు రాలేదు కానీ, కథ, టెక్నికల్ టీమ్, మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఒకసారి షూటింగ్ ప్రారంభమైతే ‘స్పిరిట్’పై మరింత ఆసక్తికరమైన అప్‌డేట్స్ వరుసగా రానున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment