పాన్-ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజా సాబ్’(Raja Saab) షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం, ఇంకా మిగిలిన రెండు పాటల కోసం చిత్రబృందం స్పెయిన్ వెళ్లనున్నది. అవి పూర్తయితే, సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయినట్లే.
ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ను దర్శకుడు మారుతి(Maruthi) తెరకెక్కిస్తుండగా, మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉంటుందని తెలుస్తోంది.
చిత్రబృందం ఎప్పటికే ఏప్రిల్ 10న సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను బట్టి రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.