టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా పేరుగాంచిన ప్రభాస్ పెళ్లి వార్త మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈసారి హీరో రామ్ చరణ్ ఇచ్చిన హింట్ కారణంగా అభిమానులు మరింత ఉత్కంఠతో ఉన్నారు. అన్‌స్టాపబుల్’ షోలో బాలకృష్ణ ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించగా, రామ్ చరణ్ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. పెళ్లి కూతురి పేరు చెప్పనప్పటికీ, ఆమె ఏ ప్రాంతానికి చెందినవారో చెప్పారు అని వార్తలొస్తున్నాయి. అమ్మాయి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం ప్రాంతానికి చెందినవారని చెబుతున్నారు.
అభిమానుల్లో ఆసక్తి పెరిగింది
ఈ హింట్‌తో ప్రభాస్ పెళ్లిపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ప్రభాస్ నిజంగానే త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెడతాడా? గణపవరం ప్రాంతం వాస్తవమేనా? అనే ప్రశ్నలతో సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. ‘అన్‌స్టాపబుల్’ తాజా ఎపిసోడ్ విడుదలైతే, మరింత స్పష్టత లభిస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.