షూటింగ్‌లో ప్ర‌భాస్‌కు గాయం.. జపాన్ టూర్‌కు దూరం

షూటింగ్‌లో ప్ర‌భాస్‌కు గాయం.. జపాన్ టూర్‌కు దూరం

పాన్ ఇండియా సూప‌ర్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా షూటింగ్‌లో గాయపడటంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ప్రభాస్‌కు చీలమండ (Ankle) భాగంలో బలంగా బెనికిందని, ఈ కారణంగా జపాన్‌లో వచ్చే నెల 3వ తేదీన విడుదల కానున్న ‘కల్కి 2898 ఏడీ’ ప్రమోషన్లకు హాజరుకాలేకపోతున్నట్టు వెల్లడించారు.

తన గాయాల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్ల టీమ్ మాత్రమే అక్కడి ప్రమోషన్లలో పాల్గొంటుందని ప్రభాస్ తెలిపారు. ఈ వార్త వెలుగులోకి రావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు.

వర్క్ షెడ్యూల్‌పై ప్రభావం చూపుతుందా?
ఇప్పటికే బిజీ షెడ్యూల్‌లో ఉన్న ప్రభాస్, ఈ గాయం వల్ల తన ప్రాజెక్టుల షూటింగ్లకు కొన్ని మార్పులు చేయాల్సి వస్తుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment