పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ తన అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫాంలో నిలిపిన ప్రభాస్, ఇప్పుడు పలు పాన్-ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, అనారోగ్య సమస్యల కారణంగా షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమాల కోసం ప్రభాస్ తన శరీరాన్ని ఎంతో కఠినంగా శ్రమ పెట్టి మార్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సమయంలో పాటించిన కఠినమైన డైట్, హై ఇంటెన్సిటీ వర్కవుట్స్ ప్రభాస్ శరీరంపై ప్రభావాన్ని చూపినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అనారోగ్యానికి కారణం.. బాహుబలి ట్రాన్స్‌ఫర్మేషన్
బాహుబలి పాత్రకు అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేయడం కోసం ప్రభాస్ ప్రతిరోజు కఠినమైన డైట్, ఎక్సర్సైజ్‌లు చేశాడు. ఆ సినిమాల విజయంతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినప్పటికీ, ఆ దశలో తీసుకున్న ఒత్తిడి వల్ల శరీరంపై కాంప్లికేషన్స్ వచ్చాయని సమాచారం. తన ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండేందుకు ప్రభాస్ తరచూ విదేశాలకు వెళ్లి చికిత్సలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సమస్యలు అతని సినిమాల వేగాన్ని ప్రభావితం చేయవచ్చనే ఊహాగానాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
సినిమాలకు బ్రేక్?
ప్రస్తుతం ప్రభాస్ నాలుగు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ది రాజాసాబ్ మూవీ సమ్మర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది, తరువాత స్పిరిట్, కల్కి 2, సలార్ 2 ప్రాజెక్ట్స్‌లో ఆయన భాగమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లను పూర్తిచేసిన తరువాత, కొంతకాలం బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఆరోగ్య సమస్యలు త్వరగా దూరమవుతాయనీ, మునుపటిలాగే ఆయన మరిన్ని అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.