ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ అనే సినిమా చేస్తుండగా, తదుపరి హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమా చేయనున్నారు. ఈ మూవీ కొత్త షెడ్యూల్ తమిళనాడులోని మధురై సమీపంలో త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.
ప్రభాస్ కొత్త లుక్.. ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్?
తాజా సమాచారం ప్రకారం, ‘ఫౌజీ’ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ కుర్రాడి పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కోసం పెద్ద సర్‌ప్రైజ్ అవుతుందని భావిస్తున్నారు. ఆయన లుక్, గెటప్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.