---Advertisement---

అభిమానులకు సారీ చెప్పిన రెబ‌ల్‌స్టార్‌

---Advertisement---

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ తన అభిమానులకు ఒక సారీ చెప్పారు. ఆయన నటించిన భారీ చిత్రం ‘కల్కి 2898ఏడీ’ 2025 జనవరి 3న జపాన్‌లో విడుదల కానుంది. అయితే, ఈ వేడుకకు స్వయంగా హాజరు కావడం సాధ్యం కాకపోవడంతో, అభిమానులకు స్పెషల్ వీడియో ద్వారా సందేశం పంపించారు.

గాయంతో విశ్రాంతిలో ప్రభాస్
ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్‌లో భాగంగా ఆయన కాలికి స్వల్ప గాయం అయ్యిందని వెల్లడించారు. “ఇప్పుడు నేను జపాన్‌కు రావడం సాధ్యం కావడం లేదు. కానీ త్వరలోనే మీ అందరితో కలుస్తాను” అని ప్రభాస్ అభిమానులకు చెప్పారు.

తన ఆరోగ్యం గురించి కూడా ప్ర‌భాస్‌ వివ‌రించారు. తాను భాగానే ఉన్నాన‌ని, ఎవ‌రూ కంగారుప‌డొద్ద‌న్నారు. అంతేకాదు, జపనీస్ భాషలో మాట్లాడుతూ “కల్కి 2898ఏడీ” చిత్రాన్ని ఆస్వాదించండి! అని అక్క‌డి ఫ్యాన్స్‌కు ప్ర‌భాస్‌ సూచించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment