‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు

'హరి హర వీరమల్లు' ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు

పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు (Fans) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా నుంచి శుభవార్త వచ్చింది. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం షూటింగ్ కొన్ని నెలలుగా ఆలస్యమవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు, సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, చిత్ర యూనిట్ అభిమానులకు తీపి కబురు అందించింది.

ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్ ఆకట్టుకోగా, ఇప్పుడు ట్రైలర్ (Trailer) విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. జూలై 3న ఉదయం 11:10 గంటలకు ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ విడుదల కానుంది.

దర్శకుడు జ్యోతికృష్ణపై పవన్ ప్రశంసలు
ఈ సినిమాకు క్రిష్‌ (Krish)తో పాటు జ్యోతికృష్ణ (Jyothi Krishna) దర్శకత్వం వహించారు. ట్రైలర్ చూసిన అనంతరం పవన్ కళ్యాణ్ దర్శకుడు జ్యోతికృష్ణను ఆత్మీయంగా అభినందించడం విశేషం. “చాలా కష్టపడ్డావ్” అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ట్రైలర్ చూస్తున్న వీడియోను చిత్ర యూనిట్ పంచుకోగా, దాని చివరలో ఈ సన్నివేశం కనిపించింది. కొన్నాళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్, ఇప్పుడు తన సినిమా ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలా కాలంగా ఈ సినిమా అప్‌డేట్‌ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ట్రైలర్ విడుదల మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment