హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్‌టాపిక్‌గా మారాయి. కెరీర్ ప్రారంభ దశలో ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సమయంలో తనకు చేదు అనుభవం ఎదురైందని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. షూటింగ్ సమయంలో అనుమతి లేకుండా ఓ స్టార్ హీరో తన క్యారవాన్‌లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడని (Behaved Obscenely), ఆ సమయంలో తాను తీవ్రంగా స్పందించి అతడిని లాగిపెట్టి కొట్టినట్లు పూజా హెగ్డే చెప్పడం సంచలనం రేపింది. ఆ ఘటన తర్వాత ఆ హీరోతో కలిసి నటించేందుకు తాను నిరాకరించానని, తన సీన్స్‌ను డూప్‌తో షూట్ చేశారని ఆమె పేర్కొన్నారు.
అయితే, పూజా హెగ్డే ప్రస్తావించిన ఆ పాన్ ఇండియా హీరో (Pan-India Hero) ఎవరు అనే అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కెరీర్ ప్రారంభంలో ఆమె నటించిన పాన్ ఇండియా చిత్రాలుగా హృతిక్ రోషన్ సరసన ‘మొహంజదారో’, ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ మాత్రమే ఉండటంతో అనుమానాలు చెలరేగుతున్నాయి. ఈ వ్యాఖ్యలు నిజమా? లేక ఎలాంటి ఆధారాలు లేని కథనమా? అన్న ప్రశ్నలు అభిమానులను అయోమయంలో పడేస్తున్నాయి. ఇదిలా ఉండగా, పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే ‘జన నాయగణ్’ విడుదల ఆలస్యం కావడం, అవకాశాలు తగ్గుతున్న తరుణంలో ఆమె వ్యాఖ్యలు మరింత వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ‘కాంచన 4’, దుల్కర్ సల్మాన్‌తో ఒక తెలుగు చిత్రం, ఓ హిందీ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది.








