టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) మళ్లీ తన గ్లామర్, టాలెంట్‌తో దక్షిణాది సినీ పరిశ్రమలో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్‌లో ఆశించినంత విజయం దక్కకపోవడంతో కొంత వెనక్కి తగ్గిన ఈ ‘బుట్టబొమ్మ’ ఇప్పుడు వరుసగా భారీ ప్రాజెక్టు(Project)లను దక్కించుకుంటూ బ్యాక్ టు ఫామ్‌లోకి వచ్చింది. సౌత్‌లో ఆమె ఖాతాలో చేరిన నాలుగు సినిమాలు ఫ్యాన్స్‌కు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. వాటిలో విజయ్ సరసన ‘జన నాయగన్’ (అధికారికంగా ప్రకటించారు), దుల్కర్ సల్మాన్‌తో ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్, అలాగే రాఘవ లారెన్స్ నటిస్తున్న హారర్ కామెడీ ఫ్రాంచైజీ ‘కాంచన 4’ ఉన్నాయి.
తాజాగా అందిన సమాచారం ప్రకారం, పూజా హెగ్డే ఇప్పుడు ధనుష్ సరసన కూడా నటించబోతోందట. ‘అమరన్’ సక్సెస్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియస్వామి రూపొందిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌లో పూజా హీరోయిన్‌గా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీల్లోనూ సందడి చేసిన పూజా, ఈ నాలుగు భారీ ప్రాజెక్టుల ద్వారా సౌత్‌లో తన స్టార్ స్టేటస్‌ను పునరుద్ధరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్లామర్‌తో పాటు తన స్క్రీన్ ప్రెజెన్స్‌లోనూ మార్పులు తీసుకువస్తున్న ఈ అందాల భామ, 2025లో మళ్లీ స్టార్ హీరోయిన్ల జాబితాలో టాప్ ప్లేస్‌కు ఎగబాకే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.








