పృథ్వీ వ్యాఖ్యలకు బండ్ల గణేశ్ కౌంటర్

పృథ్వీ వ్యాఖ్యలకు బండ్ల గణేశ్ కౌంటర్

‘లైలా’ (Laila) ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నటుడు, 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్ప‌దంగా మారాయి. దీనిపై నిర్మాత, నటుడు బండ్ల గణేశ్(Bandla Ganesh) స్పందించారు. ఫృథ్వీకి కౌంట‌ర్ ఇచ్చారు. సినిమా వేదికలపై రాజకీయాలు చర్చించకూడదని, నటీనటులు రాజకీయ అనుభవాన్ని తెరపైకి తీసుకురావడం సరైనదికాదని ఆయన ట్వీట్ చేశారు.

సినిమా ప్రమోషన్ వేదికలను రాజకీయాలకు వాడటం వల్ల అనవసరమైన వివాదాలు వస్తాయని, నిర్మాతలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. నటీనటులు వేదికపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల సినిమాకే సమస్యలు వస్తాయని, ఆలోచించి మాట్లాడాలని సూచించారు. “గెలుపు, ఓటమి సహజం… కానీ మన మాటలు మళ్లీ మనకే సమస్యలు తెచ్చిపెట్టవచ్చు” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఫృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. ట్విట్ట‌ర్‌లో బాయ్‌కాట్ లైలా ట్రెండింగ్‌లో ఉంది. దీంతో లైలా (Laila Movie) చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ పెట్టి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఫృథ్వీ వ్యాఖ్య‌ల‌తో సినిమాకు ఎలాంటి సంబంధం లేద‌ని హీరో విశ్వ‌క్‌సేన్ ప్ర‌క‌టించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment