---Advertisement---

ఇందిరా తర్వాత మోదీయే.. 43 ఏళ్ల తర్వాత కువైట్‌కు పయనం

ఇందిరా తర్వాత మోదీయే.. 43 ఏళ్ల తర్వాత కువైట్‌కు పయనం
---Advertisement---

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం కువైటు బయల్దేరారు. అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవ వేడుకకు కువైటు చక్రవర్తి షేక్ మెహేషల్ ఆహ్వానం మేరకు పీఎం మోదీ హాజరవుతున్నారు. ఈ పర్యటన ప్రత్యేకత ఏమిటంటే.. 1981లో ఇందిరా గాంధీ పర్యటన తర్వాత కువైటుకు వెళ్లిన తొలి భారత ప్రధానమంత్రి మోదీయే. అంటే, 43 ఏళ్లుగా భారత ప్రధాన మంత్రులెవరూ ఆ దేశానికి పర్యటన చేయకపోవడం విశేషం.

మోదీ 26వ అరేబియా గల్ఫ్ కప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం షేక్ సాద్ అల్ అబ్దుల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగనుంది. ‘హలా మోదీ’ పేరుతో నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ప్రవాస భారతీయులతో మోదీ మాట్లాడనున్నారు. మోదీ అక్కడ భారతీయ కార్మిక శిబిరాన్ని సందర్శించి, వారి సంక్షేమంపై చర్చించనున్నారు.

ఒప్పందాలపై దృష్టి..
కువైట్ రాజుతో మోదీ రక్షణ, వాణిజ్యం, ఇతర కీలక రంగాల్లో పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.

కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యం
కువైట్‌లో సుమారు 10 లక్షల మంది భారతీయులు జీవిస్తున్నారు. వీరి సంక్షేమంపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్ ఛటర్జీ తెలిపారు. మోదీ లేబర్ క్యాంప్ సందర్శన ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment