ఢిల్లీ విజ‌యంపై ప్ర‌ధాని మోడీ ట్వీట్‌..

ఢిల్లీ విజ‌యంపై ప్ర‌ధాని మోడీ ట్వీట్‌..

రెండున్న‌ర ద‌శాబ్దాల త‌రువాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో (DelhiElectionResults) భార‌తీయ జ‌న‌తా పార్టీ భారీ విజ‌యాన్ని అందుకుంది. 70 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గానూ మ్యాజిక్ ఫిగ‌ర్ 36 దాటి.. మ‌రో 11 సీట్ల‌లో ఆధిక్యంలో ఉంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నిక‌ల్లో చ‌తికిల‌ప‌డిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెర‌వలేదు.

ఢిల్లీ అభివృద్ధికి కృషి చేస్తాం..
ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలుపొందిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. “ఢిల్లీ ప్రజలు చారిత్రాత్మక తీర్పును ఇచ్చారు. సుపరిపాలన, అభివృద్ధి కోసం ప్రజలు తమ ఆశీర్వాదాన్ని అందించారు. ఇది మాకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఢిల్లీ అభివృద్ధికి మా వంతు కృషిని కొనసాగిస్తాం. ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు, వికసిత్ భారత నిర్మాణానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాం” అని ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment