ఇజ్రాయెల్ దాడి.. ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు

ఇజ్రాయెల్ దాడి: ప్రధాని మోడీ ఖండన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో ఫోన్‌లో మాట్లాడారు. ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖతార్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడాన్ని భారతదేశం ఖండిస్తుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

ఈ విషయంపై ప్రధాని తన ట్వీట్‌లో, “ఖతార్ అమీర్‌తో మాట్లాడి దోహాలో జరిగిన దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను. సోదర దేశమైన ఖతార్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని భారతదేశం ఖండిస్తోంది. వివాదాలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని మేము పిలుపునిస్తున్నాము” అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం ఖతార్ చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని ప్రశంసించారు. అలాగే, కాల్పుల విరమణ, బందీల విడుదలలో ఖతార్ మధ్యవర్తిత్వ పాత్రను కూడా ప్రస్తావించారు.

దోహాలో హమాస్ పొలిటికల్ బ్యూరో నాయకులే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో కనీసం ఐదుగురు మరణించారు. మృతుల్లో హమాస్ కీలక నేతలకు సంబంధించిన ముగ్గురు బాడీగార్డులు కూడా ఉన్నారని హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు సుహైల్ అల్ హిందీ తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఎల్లప్పుడూ దృఢమైన మద్దతు ఇస్తుందని ప్రధాని మోడీ నొక్కిచెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment