కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలోని కిషన్‌రెడ్డి నివాసంలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలకు సినీ నటుడు చిరంజీవి, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరావు, బ్యాడ్మింటన్ క్రీడాకారిని పీవీ సింధుతో కలిసి సంక్రాంతి వేడుకలకు ప్రధాని జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రముఖ గాయని సునీత గీతాలాపనతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని తొలుత తులసి చెట్టుకు పూజ చేశారు. ఈ సంబరాలకు ప్రధాని మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా,పలువురు కేంద్రమంత్రులు,బీజేపీ ఎంపీలు, బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.
కిషన్‌రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు, హాజరైన ప్రముఖులు
by K.N.Chary
Updated On: January 14, 2025 8:39 am
---Advertisement---