కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నివాసంలో సంక్రాంతి వేడుకలు ప్రతీ ఏటా ఘనంగా జరుగుతాయి. ఈసారి ఈ వేడుకలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరుకానున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయని తెలుస్తోంది.
ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నివాసంలో సాయంత్రం 5 గంటలు సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఈ సంబరాల్లో తెలంగాణ సంప్రదాయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు, తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఉదయం జమ్మూ కాశ్మీర్ పర్యటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉదయం జమ్మూ కాశ్మీర్‌లో కొత్తగా నిర్మించిన జెడ్-మోడ్ టన్నెల్‌ను ప్రారంభించనున్నారు. రూ. 2,400 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టన్నెల్ లేహ్-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉంది. ఇది లద్దాఖ్‌కు రహదారి ద్వారా చేరుకునే అవకాశం కల్పిస్తోంది.