అమరావతి పున‌ర్నిర్మాణం.. నేడు ఏపీకి ప్రధాని మోడీ

అమరావతి పున‌ర్నిర్మాణం.. నేడు ఏపీకి ప్రధాని మోడీ

కూట‌మి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి పునర్నిర్మాణం (Amaravati Reconstruction) నేడు (మే 2) ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ప్రారంభం కానుంది. ప్ర‌ధాని మోడీ శుక్ర‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో (Andhra Pradesh) ప‌ర్య‌టించ‌నున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3:30కి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న మోడీ, అక్కడి నుంచి అమరావతికి వెళ్లి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు (Foundation Ceremonies) చేసి, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మోడీ చేతుల మీదుగా అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులు రెండోసారి ప్రారంభ‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూట‌మి ప్రభుత్వం (Coalition government), పున‌ర్నిర్మాణ కార్య‌క్ర‌మానికి సంబంధించిన‌ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. ముఖ్యంగా సభ కోసం మూడు వేదికలను సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై ప్రధాని మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan), ఇతర 11 మంది ప్రముఖులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.

అమరావతి ప్రాజెక్టులకు శంకుస్థాపన
అమరావతిలో శాశ్వత హైకోర్టు (Permanent High Court), సచివాలయం (Secretariat), అసెంబ్లీ భవనం (Assembly), న్యాయమూర్తుల నివాస సముదాయం, ఎమ్మెల్యేలు, మంత్రుల క్వార్టర్స్, ఆలిండియా సర్వీసెస్ అధికారుల ఇళ్ళ నిర్మాణాలకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కేంద్ర పథకాల కింద అనేక పెద్ద ప్రాజెక్టులకు కూడా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

అమరావతి పెవిలియన్
ప్రముఖుల‌ వేదిక వెనుక ‘అమరావతి పెవిలియన్ (Amaravati Pavilion)’ ఏర్పాటు చేశారు. ఇందులో రాజధాని చరిత్ర, సాంస్కృతిక వైభవం, నిర్మాణ ప్రణాళికలు, భూసేకరణ విధానాలపై విజువల్స్‌ ద్వారా ప్రధానికి వివరించనున్నారు. ఈ సభకు సుమారు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని కూటమి అంచనా వేసింది. ఇందు కోసం 6600 బ‌స్సుల‌ను ఏర్పాటు చేసింది. ప్రజల రాకపోకలకు 11 ప్రధాన మార్గాలు సిద్ధం చేశారు. పార్కింగ్ కోసం 11 ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభావేదిక వద్ద పకడ్బందీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఎస్పీజీ పర్యవేక్షణ
ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎస్పీజీ బృందం (SPG Team) భద్రతను పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభా ప్రాంగణాన్ని ఇన్‌చార్జ్ డీజీపీ హరీష్ గుప్తా (DGP Harish Gupta) పరిశీలించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ పరిధిలో డ్రోన్లు, నల్ల బెలూన్లపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment