---Advertisement---

రైతులకు కేంద్రం షాక్‌.. ‘పీఎం కిసాన్‌’లో కీలక మార్పులు

రైతులకు కేంద్రం షాక్‌.. 'పీఎం కిసాన్‌'లో కీలక మార్పులు
---Advertisement---

రైతులకు కేంద్ర ప్రభుత్వం గ‌ట్టి షాక్ ఇచ్చింది. ప్రధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి పథకం (పీఎం కిసాన్) కింద గతంలో అందిన ప్రయోజనాలకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. పీఎం కిసాన్ పథకం 2019లో ప్రారంభమైనప్పటి నుంచి సాగుభూమి కలిగిన రైతులకు ప్రతీ ఏడాదీ రూ.6,000 సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు దఫాల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే, తాజా మార్పుల ప్రకారం 2019 ఫిబ్రవరి 1 నాటికి భూమి ఎవరి పేరుతో ఉందో, వారికే ఈ పథకం వర్తిస్తుంది.

చిన్న రైతులకు నష్టమా?
ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి అమ్మడం, కొనడం లేదా మార్పు చేసిన రైతులు పీఎం కిసాన్ పథకానికి అనర్హులుగా పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో సన్న, చిన్నకారు రైతులకు నష్టం వాటిల్లే అవకాశముంది. ఈ నిర్ణయంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా వేలాది మంది ఆంధ్రప్రదేశ్ రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్ర స్థాయి హామీలు కూడా నిలకడగా లేవు
కేంద్రం నూతన మార్గదర్శకాలపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు తగిన భరోసా అందడం లేదు. చంద్రబాబు ఎన్నికల హామీలో ఏడాదికి రూ.20 వేలు పంట పెట్టుబ‌డి సాయమ‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ అది నేటికీ అమ‌లుకు నోచుకోలేదు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు సమయానుకూలంగా స్పందించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment