ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న పిఠాపురం (Pithapuram) టీడీపీ (TDP) నేత ఎన్వీఎస్ఎన్ వర్మ (NVSN Varma) తాజాగా ఓ సంచలన వీడియోను షేర్ చేశారు. పిఠాపురం జగ్గయ్య కాలనీ (Jaggayya Colony) లో పారిశుద్ధ్య (Sanitation) సమస్యలు తీవ్రంగా పెరిగిపోయాయని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఆరోపించారు. ఈ సమస్యలను అడ్రస్ చేస్తూ ఆయన తన ట్విట్టర్ వేదికగా ఒక షాకింగ్ వీడియో (Video) షేర్ చేశారు.
కాలనీ వాసుల ఆరోగ్యానికి ముప్పు
వర్మ మాట్లాడుతూ.. ‘కార్యకర్తే అధినేత’ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు తన దృష్టికి ఈ సమస్యను తీసుకువచ్చినట్టు తెలిపారు. కాలనీలోని వాటర్ ట్యాంక్‌లు (Water Tanks) క్లీనింగ్ చేయకపోవడం, డ్రైనేజీలు (Drainage) మూసుకుపోవడం, చెత్త కుప్పలు (Garbage Heaps) పేరుకుపోవడం వల్ల ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. పైగా, సెప్టిక్ ట్యాంకులు పొంగిపొర్లి చెదురుమదురు వ్యాపించాయని వర్మ ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా వీడియో
ఈ వీడియోలో పిఠాపురం మున్సిపాలిటీ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. పైగా, స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను టార్గెట్ చేస్తూ వర్మ ఈ వీడియోను షేర్ చేశారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. వర్మ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాన్ని గూర్చి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశామని తెలిపారు. ఈ అంశంపై టీడీపీ-జనసేన (TDP-Jana Sena) వర్గాల్లో ట్విట్టర్ (Twitter) వేదికగా వాదోపవాదాలు జరుగుతున్నాయి.
అధికారుల నిర్లక్ష్యంతో జగ్గయ్య చెరువులో ప్రజలు పడుతున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. pic.twitter.com/fNk3qzMFgy
— SVSN Varma (@SVSN_Varma) March 28, 2025