పిఠాపురంలో అశ్లీల నృత్యాలు.. వీడియోలు వైర‌ల్‌

పిఠాపురంలో అశ్లీల నృత్యాలు.. వీడియోలు వైర‌ల్‌

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల లైంగిక వేధింపులు, రాజకీయ ఘర్షణలు వంటి ఘటనలతో ఈ ప్రాంతం చర్చనీయాంశమవుతుండగా, తాజాగా రాత్రివేళ రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించిన ఘటన కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, పిఠాపురం నియోజకవర్గంలోని యు. కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో (Mulapet) పోలేరమ్మ జాతర (Poleramma Jathara) సందర్భంగా 12 మంది యువతులతో అర్ధరాత్రి వరకు రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు.

అర్ధనగ్న డ్యాన్స్.. వివాదాస్ప‌దం..
వీడియోల్లో అర్ధనగ్నంగా డ్యాన్స్ చేస్తున్న యువతుల మధ్య గ్రామస్తులు తెగ ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది.
18 ఏళ్లు నిండని యువకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం, ఇది మరింత వివాదాస్పదమైంది. ఈ వేడుకకు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహించారని ఆరోపణలు వస్తున్నాయి.

అనుమ‌తి లేకుండా..
ఈ వివాదంపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. “డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు జరగడం దారుణం” అంటూ విమర్శించారు. ఈ ఈవెంట్‌కు కూటమి (TDP, Janasena) పార్టీకి చెందిన కొందరు నేతలే అనుమతులు లేకుండానే ఏర్పాటు చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment