ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో కీలక మలుపు తిరిగింది. మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao), సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, శుక్రవారం SIT ఎదుట లొంగిపోయారు (Surrendered). కోర్టు వారం రోజుల పాటు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇచ్చింది. విచారణలో ప్రభాకర్ రావు సహకరించడం లేదని, సెల్‌ఫోన్ పాస్‌వర్డ్‌లు ఇవ్వకుండా దర్యాప్తును అడ్డుకుంటున్నారని SIT కోర్టుకు తెలిపింది. అంతేకాక, దశాబ్దాలుగా ఉన్న ముఖ్యమైన డేటాను(Important Data) ధ్వంసం చేశారని కూడా ఆరోపించింది.
ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారన్న వివరాలను ప్రభాకర్ రావు దాచి ఉంచుతున్నారని SIT ధర్మాసనానికి వివరించింది. అందువల్ల ముందస్తు బెయిల్‌ను రద్దు చేసి కస్టోడియల్ విచారణకు అనుమతించాలని వాదించింది. వాదనలు పరిశీలించిన సుప్రీంకోర్టు, ప్రభాకర్ రావుపై ఉన్న అంతరిమ రక్షణను సడలించి, SITకు వారంపాటు కస్టడీ ఇచ్చింది. ఈ విచారణలో కేసుకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని SIT ప్రతినిధులు భావిస్తున్నారు.
ఇటీవల సుప్రీంకోర్టు విచారణలో జస్టిస్ బీవీ నాగరత్న (Justice BV Nagarathna), మధ్యంతర రక్షణ కారణంగా ప్రభాకర్ రావు దర్యాప్తుకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనపై ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై ప్రభాకర్ రావు తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్, సహకారంపై వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలిపారు. అయితే ఆ అఫిడవిట్‌ను పరిశీలించే అవకాశం లభించలేదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలిపారు. చివరగా ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం, SIT ఎదుట ప్రభాకర్ రావు లొంగిపోవాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.
ఐ








