పెనుగంచిప్రోలులో వింత వైరస్.. చిన్నారుల‌కు బొబ్బ‌లు

పెనుగంచిప్రోలులో వింత వైరస్.. చిన్నారుల‌కు బొబ్బ‌లు

ఎన్టీఆర్ జిల్లా (NTR District) పెనుగంచిప్రోలు (Penuganchiprolu) గ్రామంలో వింత వైరస్ (Virus) కలకలం రేపుతోంది. గ్రామంలోని పలువురు చిన్నారులు వైరల్ ఇన్ఫెక్షన్‌కు గురై, చేతులు, కాళ్లపై బొబ్బలు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితితో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. బాధిత చిన్నారులను (Children) తక్షణమే విజయవాడ (Vijayawada)లోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (GGH)కి తరలించారు.

జిల్లా వైద్యాధికారి (DMHO) సుహాసిని స్వయంగా గ్రామాన్ని సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటికే గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వైరస్ నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించామ‌ని, ఈ వైరస్ పై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామ‌న్నారు. గ్రామంలో వైద్య బృందంతో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

వైరస్ వ్యాప్తి కారణాలను గుర్తించేందుకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక బృందాలు పరిశోధనలు ప్రారంభించాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఈ ఘటనపై స్పందించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు తక్షణమే నిర్వహించి సమయానుసారంగా చికిత్స అందించాలని ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment