పెంచలయ్య హత్య కేసు.. కామాక్షమ్మ ఇంట్లో గంజాయి

పెంచలయ్య హత్య కేసు.. కామాక్షమ్మ ఇంట్లో గంజాయి

నెల్లూరు జిల్లా (Nellore District)లో ఉద్యమకారుడు పెంచలయ్య (Penchalayya) హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఇది టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి (TDP MLA Kotamreddy Sridhar Reddy) అనుచ‌రుల పనేన‌ని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి (Kakani Govardhan Reddy) ఆరోపిస్తున్నారు. జిల్లాలో గంజాయి బ్యాచ్‌ (Ganja Gang)ను పెంచిపోషిస్తున్నార‌ని ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ నేప‌థ్యంలో పెంచ‌ల‌య్యను హ‌త‌మార్చిన‌ట్లుగా పోలీసులు నిర్ధారించిన అర‌ని కామాక్ష‌మ్మ (Arani Kamakshamma) ఇంట్లో రెండు కేజీ గంజాయి ప‌ట్టుబ‌డ‌డం సంచ‌ల‌నంగా మారింది.

పోలీసులు అరవ కామాక్షమ్మ, ఆమె భర్త జోసెఫ్‌ (Joseph)తో పాటు మరో ఇద్దరు కీలక సభ్యుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు నిర్వహిస్తున్నారు. నిన్న జరిగిన కాల్పుల్లో గాయపడ్డ A1 నిందితుడు జేమ్స్‌ (James)ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, అతడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కామాక్షమ్మ ముఠాపై గతంలోనే హత్యాయత్నం సహా పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని విచారణలో బయటపడింది.

హత్య కుట్రధారి అరని కామాక్షిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె బోణిగానితోటలోని నివాసంపై పోలీసులు సోదాలు నిర్వహించగా, రెండు కిలోల గంజాయి స్వాధీనమైంది. ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులు కాడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చేపట్టగా, రేపటికి అందరినీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

ఈ కేసు రాజకీయంగా వేడెక్కుతోంది. పెంచలయ్యను హతమార్చింది టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులేనని వైసీపీ సీనియర్ నేత, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గంజాయి వ్యాపారంలో నిమగ్నమైన ముఠాకు రాజకీయ అండ ఉందని, కోటంరెడ్డి సహకారంతోనే వీరు చెలరేగిపోతున్నారని ఆయన విమర్శించారు. ‘‘పెంచలయ్య మృతదేహం ముందు నటన చేసి కన్నీళ్లు కార్చడం కాదు, నిజమైన పశ్చాత్తాపం పడాలి కోటంరెడ్డి’’ అంటూ కాకాణి వ్యాఖ్యానించారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గంజాయి మాఫియా (Ganja Mafia) పట్టు ఎంత ప్రమాదకరంగా మారిందో ఈ హత్య నిరూపిస్తోందని ఆయన అన్నారు. రాజకీయ అండతో నేరస్థులు దూకుడు పెంచుకోవడం వల్లే పెంచలయ్య ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తుండగా, మరోవైపు రాజకీయ ఆరోపణలు కేసును రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment