దేశ వ్యాప్తంగా వినాయక చతుర్థి (Ganesha Chaturthi) ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చవితి వేడుకలు మొదలయ్యాయి. గణేష్ మండపాలను (Ganesh Pandals) బ్రహ్మాండంగా డెకరేషన్ (Decoration) చేశారు. వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న వినాయక ప్రతిమలకు వైభవంగా పూజలు జరిపారు. కానీ, అన్నమయ్య (Annamayya) జిల్లా పీలేరు (Pileru)లో సుందరంగా ముస్తాబు చేసిన వినాయక మండపం మంటల్లో కాలిబూడిదైంది.
ఏపీ (Andhra Pradesh)లోని అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని ఎల్‌బీఎస్ రోడ్డు (LBS Road)లో అపశృతి చోటుచేసుకుంది. యువకులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న వినాయక మండపం క్షణాల్లో కాలిపోయింది (Burnt Down). ఎల్‌బీఎస్ రోడ్డులో ఏర్పాటు చేసిన మండపంలో భారీ ప్రతిమను తెచ్చి ఘనంగా పూజలు జరిపారు. అయితే గణేష్ ప్రతిమ ముందర దీపం వెలిగించి ఉండగా ప్రమాదవశాత్తు దీపం అంటుకొని మండపం పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. క్షణాల్లో మండపం కాలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ జరగలేదని తెలుస్తోంది. మండపం కాలిపోతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) August 27, 2025
అన్నమయ్య జిల్లా పీలేరు LBS రోడ్డులోని వినాయక మండపంలో అపశృతి
వినాయక ప్రతిమ ముందర దీపం వెలిగించి ఉండగా ప్రమాదవశాత్తు దీపం అంటుకొని మండపం పూర్తిగా అగ్నికి ఆహుతి
క్షణాల్లో కాలిపోయిన మండపం, తృటిలో తప్పిన ప్రమాదం pic.twitter.com/5tgbg4FDFw