గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ (‘Peddi’) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం మొదటి నుండి భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ రగ్గడ్ రూరల్ లుక్, ఫస్ట్ షాట్ గ్లింప్స్ సృష్టించిన హైప్‌తో ఇంకా హైప్ పెరిగింది. తాజాగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తన సోషల్ మీడియా ఖాతాలో షూటింగ్ అప్డేట్ షేర్ చేసి, రామ్ చరణ్, బాలీవుడ్ నటుడు (Bollywood Actor) దివ్యేందు శర్మ (Divyenndu Sharma)పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోస్ట్ సినిమా పట్ల అభిమానుల ఆసక్తిని మరింత పెంచింది.
‘పెద్ది’ ఒక రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోందని ఇటీవల విడుదలైన గ్లింప్స్ ద్వారా స్పష్టమవుతోంది. ఇందులో రామ్ చరణ్ విజయనగరం స్లాంగ్ (Vizianagaram Slang)లో డైలాగులు చెబుతూ కనిపిస్తారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, సత్య, ఉపేంద్ర లిమయే, కృతి శెట్టి, ఇతరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad)లోని జన్వాడ సమీపంలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో ప్రస్తుత షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. ఇందులో రామ్ చరణ్ మరియు దివ్యేందు శర్మపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
బుచ్చిబాబు తన పోస్ట్‌లో “స్మైల్స్, డిస్కషన్స్, హార్డ్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి” అని పేర్కొంటూ సెట్ నుంచి రామ్ చరణ్, దివ్యేందు, తనతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు, ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమా సంగీతం ఏ.ఆర్. రెహమాన్ (A.R. Rahman) సమకూరుస్తున్నారు. ఈ చిత్రం మునపటి ‘రంగస్థలం’ కంటే పెద్ద ఎమోషనల్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గ్లోబల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.