మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi) పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. స్పోర్ట్స్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ పీరియడ్ చిత్రానికి బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తుండగా, సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది.
జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పుట్టినరోజు సందర్భంగా నేడు (మార్చి 6) చిత్రబృందం ప్రత్యేక సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమాలో ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రంలో జాన్వీ ‘అచియమ్మ’ (Achiyamma)అనే పాత్రలో కనిపించబోతున్నట్లు వెల్లడించారు.
విడుదలైన వీడియోలో జాన్వీ సంప్రదాయ వేషధారణలో కనిపిస్తూ ఆకట్టుకుంది. గ్రామీణ నేపథ్యానికి తగ్గట్టుగా ఆమె పాత్రను రూపొందించినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ – జాన్వీ కపూర్ జంటపై ఇప్పటికే అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది.








