ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృష్ణాజిల్లాలో పర్యటిస్తూ అపశృతి చోటుచేసుకుంది. గొడవర్రులో రోడ్డు పరిశీలన కోసం డిప్యూటీ సీఎం పవన్ వెళ్లారు. ఈ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట పరిస్థితి ఏర్పడి, పవన్‌ను చూసేందుకు వచ్చిన ఒక బాలిక స్పృహతప్పి పడిపోయింది. వెంటనే అక్కడున్నవారు స్పందించి ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు.
స్థానిక అధికారులు, పవన్ కల్యాణ్ అనుచరులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గందరగోళం చిన్నపాటి ఇబ్బందులు కలిగించినప్పటికీ, ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. ప్రస్తుతం ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.